Maestro Trailer on 23rd | ఈ నెల 23న మాస్ట్రో ట్రైలర్ విడుదల

‘చక్కటి ఉద్యోగం, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడో పియానో ప్లేయర్. అనుకోకుండా ఓ హత్యకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నితిన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎస్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. తమన్నా, నభానటేష్ కథానాయికలు. డిస్నీ హాట్‌స్టార్ ద్వారా త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నెల 23న ట్రైలర్‌ను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. అంధుడిగా నటించే ఓ పియానో ప్లేయర్ జీవితగమనంలో ఎదురైన సంఘర్షణ ఉత్కంఠను పంచుతుంది’ అని అన్నారు. జిషుసేన్‌గుప్తా, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: జె.యువరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Maestro
- nabha natesh
- nitin
- tamanna
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

