NITHIN: పుకార్లు నిజమయ్యాయి.. ఓటీటీ బాట పట్టిన నితిన్ సినిమా !

ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాస్ట్రో. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
మాస్ట్రో చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలానే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. నితిన్, నభా, తమన్నాలతో కూడిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

