MAD Square | ఓటీటీలోకి వచ్చేసిన ‘మ్యాడ్ స్క్వేర్’.. ఎక్కడ చూడొచ్చంటే!
MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ (MAD Square).
MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ (MAD Square). మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా.. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. నాగవంశీ నిర్మించాడు. ఏప్రిల్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ను అందకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యాడ్ గ్యాంగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కథతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వడంతో మ్యాడ్ స్క్వేర్ మొదలవుతుంది. కాలేజీ అనంతరం మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమకు నచ్చిన పని చేసుకొనే పనిలో ఉంటారు. అయితే ఈ క్రమంలోనే లడ్డుగాడి(విష్ణు)కి పెళ్లి కుదిరినట్లు మ్యాడ్ గ్యాంగ్‌కి తెలుస్తుంది. దీంతో అతడి పెళ్లికి వెళుతుంది ఈ గ్యాంగ్. అయితే పెళ్లికి అన్ని సిద్ధం అనుకుంటున్న సమయంలో లడ్డు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి సడన్‌గా లేచిపోతుంది. దీంతో లడ్డుని పట్టుకుని మ్యాడ్ గ్యాంగ్ పెళ్లి కాకుండానే గోవాకి హనిమూన్ ట్రిప్‌కి వెళతారు. అయితే మ్యాడ్ గ్యాంగ్ గోవాకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది. గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్)ను భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Mamulgane veelatho MAD mad untadhi, inka laddu pelli ante MAD MAXX ey 😎🔥
Watch Mad Square, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/35PvMZpKpT— Netflix India South (@Netflix_INSouth) April 25, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

