Robinhood | నితిన్ ‘రాబిన్‌హుడ్’కి పోటిగా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’
Robinhood - MAD Square | హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood).
Nithiin Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమా విషయానికి వస్తే.. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇదే రోజు మరో క్రేజీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ హౌజ్ సితార ఎంటర్టైనమెంట్స్ నుంచి వస్తున్న తాజా ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). “మ్యాడ్” (MAD) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతుంది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. మార్చి 28, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో రావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే “రాబిన్‌హుడ్” ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. “మ్యాడ్ స్క్వేర్” యూత్‌ని ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్గా రాబోతుండడంతో ప్రేక్షకుల ఏ జానర్ నచ్చితే ఆ జానర్లో సినిమాకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

