Mad movie talk | ఓ మై మ్యాడ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ
MAD movie talk | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) వన్ ఆఫ్ హీరోగా నటించిన చిత్రం మ్యాడ్ ( MAD). ఈ యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా నేఅక్టోబర్ 6న (నేడు)థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే..
MAD movie talk | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) వన్ ఆఫ్ హీరోగా నటించిన చిత్రం మ్యాడ్ ( MAD). యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. అక్టోబర్ 6న (నేడు)థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే..
అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్..
ఈ రోజుల్లో కడుపులు చెక్కలై నవ్వి నవ్వి చచ్చిపోయేంత మంచి సినిమాలు కూడా వస్తున్నాయా అనుకోవచ్చు.. కానీ అప్పుడప్పుడూ వస్తున్నాయి. చిన్న సినిమాలే కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అవి. ఆ మధ్య సామజవరగమనా సినిమాతో అదిరిపోయే కామెడీ ఇచ్చాడు శ్రీవిష్ణు. దానికి ముందు జాతి రత్నాలు ఆ రేంజ్ కామెడీ ఇచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా మ్యాడ్ (MAD) మళ్లీ అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.
నా సినిమా చూస్తూ కాసేపు నవ్వకుండా ఉండగలిగితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా.. ఓ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేశాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు కానీ నిజంగా తన కథపై ఎంత నమ్మకం లేకపోతే మీడియా ముందు ఓ నిర్మాత అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడబ్బా అని ఎవరూ ఆలోచించలేదు. అది ఓవర్ కాన్పిడెన్స్ కాదు.. ఓన్లీ కాన్ఫిడెన్స్.. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అని సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది.
వాటన్నింటికీ బాబు లాంటి సినిమా..
వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) మ్యాడ్ లాంటి కథను పిక్ చేసుకున్నపుడే సీన్ అర్థమైంది. ఇప్పుడు ప్రూవ్ అయింది. తెలుగులో కాలేజ్ కామెడీ డ్రామాస్ చాలా వచ్చాయి. హ్యాపీడేస్ నుంచి కేరింత వరకు ఎన్నో సినిమాలు వచ్చినా కానీ.. MAD వాటన్నింటికీ బాబు లాంటి సినిమా. అసలు ఈ సినిమా గురించి ఎక్కడ మొదలుపెట్టాలి.. ఎక్కడ ముగించాలో కూడా తెలియదు. అంతగా కామెడీ ప్రొవైడ్ చేసాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar). ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించారు మేకర్స్.
రొటీన్ స్టోరీకి ఇంతకంటే రేసీ స్క్రీన్ ప్లే మరొకటి ఉండదు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరో అదిరిపోయే సీన్ వచ్చింది. ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ కాదు థర్డ్ హాఫ్ పెట్టినా చూసేట్లు తీసారు దర్శకుడు కళ్యాణ్. రెండు గంటలు అలా అయిపోయాయి అంతే. ముగ్గురు హీరోలు అదరగొట్టారు. లాజిక్ లేకుండా చూస్తే సినిమా కడుపులు చెక్కలైపోయేలా నవ్విస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.
మ్యాడ్ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

