Macherla Niyojakavargam | నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడేనట?
Macherla Niyojakavargam Trailer Launch Event | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో సినీఅభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నితిన్ ఆశలన్ని ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి.ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. తాజాగా చిత్రబృందం మరో బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 30న జరుపనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. గుంటూరులోని బ్రొడిపేటలో ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ‘రా రా రెడ్డి’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
Assemble everyone 📢💥
All set for the MASSive Trailer Launch Event of @actor_nithiin's #MacherlaNiyojakavargam 🚩🔥
🗓️ July 30th from 5PM onwards!
📍 LEM School Ground, Brodipet, Guntur@IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic#MNVFromAUG12th pic.twitter.com/j4ylGna5jo— Sreshth Movies (@SreshthMovies) July 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

