నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజక వర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 12న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘రాజకీయాంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నితిన్ మునుపెన్నడూ చూడ ని కొత్త పంథాలో కనిపిస్తాడు. ఇటీవల విడుదల చేసిన ‘రారా రెడ్డి’ అనే పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో సముద్రఖని ఫస్ట్‌లుక్ సినిమాపై మరింత ఉత్సుకతను పెంచింది’ అని చిత్రబృందం పేర్కొంది. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: మామిడాల తిరుపతి, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి.