Macherla Niyojakavargam Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ఇటీవలే ఈయన నటించిన 'మాచర్ల నియోజకవర్గం' రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొన్నటి వరకు లవ్‌స్టోరీ సినిమాలు తీసే నితిన్..
Macherla Niyojakavargam On Ott | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొన్నటి వరకు లవ్‌స్టోరీ సినిమాలు తీసే నితిన్.. ఈ సారి తన జానర్‌కు భిన్నంగా పూర్తి స్థాయి సీరియస్ కథతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాగా సక్సెస్ ఫుల్ ఎడిటర్‌గా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ దర్శకుడిగా విఫలం అయ్యాడు. ఇక ఓపెనింగ్ డే నుండి ఈ సినిమా పూర్ కలెక్షన్లను రాబట్టింది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ‘కార్తికేయ-2’ రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రం రెండు వారాలకే దుకాణం సర్దేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తు్న్నారు.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ-5’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు. ప్రస్తుతం నితిన్ ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్‌కు ఇప్పటివరకు మరో హిట్ లేదు. ఇక నితిన్ తన నెక్ట్స్ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. మరీ ఈ చిత్రంతో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

