సీనియర్ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) కుమారుడు సిబిరాజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘మాయోన్’. కిషోర్ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దేవుడికి, సైన్స్‌కి మధ్య జరిగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్తో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా విజువల్ వండర్లా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.