Allu Ramesh Passes Away | తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ రంగస్థల నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ మృతి చెందాడు. గుండె ఫెయిల్యూర్ కారణంగా అల్లు రమేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రంగస్థల నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు.
వైజాగ్‌కు చెందిన అల్లు రమేశ్ నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చాడు. ఆయన నటించిన తొలి సినిమా సిరిజల్లు. ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఆయన ఒకడు. నెపోలియన్ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కేరింతలు ఆయన చివరి సినిమా. ఇటీవలే ఆయన నటించిన మావిడాకులు వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ వెబ్ సిరీస్‌తో రమేశ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.