Maa Oori Polimera 2 | ఓటీటీలోకి రాబోతున్న ‘మా ఊరి పొలిమేర 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.?
Maa Oori Polimera 2 | మా ఊరి పొలిమేరతో ఓటీటీలో సూపర్ హిట్ కొట్టాడు టాలీవుడ్ కమెడియన్ సత్యం రాజేష్. రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో పెను సంచలనాలు సృష్టించింది. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది.
Maa Oori Polimera 2 | ‘మా ఊరి పొలిమేర’తో ఓటీటీలో సూపర్ హిట్ కొట్టాడు టాలీవుడ్ కమెడియన్ సత్యం రాజేష్. రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో పెను సంచలనాలు సృష్టించింది. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలై ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్ నటనైతే వేరే లెవల్. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు.
తాజాగా ఇదే సినిమాకు ‘మా ఊరి పొలిమేర 2’ అంటూ సీక్వెల్ వచ్చింది. అనీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలాదిత్య మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక నవంబర్ 3వ తేదీన భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధించింది. తొలిరోజే రూ. 3 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో (Maa Oori Polimera 2 on Aha) ఈ సినిమా డిసెంబర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక అనీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలాదిత్య మరో ప్రధాన పాత్రలో నటించాడు. డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ, చిత్రమ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండియర్‌గా రూపొందించాడు.
రా ఇటుగ రా పిడుగులా… Mind-Bending Blockbuster #Polimera2 vachestondi, oohinchani twist la tho on aha on 08 Dec.
24 hours early access to aha Gold subscribers@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 pic.twitter.com/OvFCbbZPNo
— ahavideoin (@ahavideoIN) December 1, 2023
కథలోకి వెళితే.. జంగయ్య (బాలాదిత్య) తన అన్న కొమిరి (సత్యం రాజేష్).. కవితను చేతబడి చేసి చంపాడని నిజం తెలుసుకున్నట్లు ‘పొలిమేర’ తొలి భాగంలో చూపించిన విషయం తెలిసిందే. ఈ సీన్ నుంచే ‘పొలిమేర-2’ కథ మొదలవుతుంది. జాస్తిపల్లి పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎస్సై రవీంద్ర నాయక్ కొమిరి కేసును తిరిగి ఓపెన్ చేస్తాడు. తన అన్నను చేతబడి నెపంతో హత్య చేశారని కేసు వేసిన జంగయ్య ఆఖరి నిమిషంలో కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడు?ఆ తర్వాత నుంచి తనెందుకు కనిపించకుండా పోయాడు? అన్నది రెండో భాగం కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

