Maa Oori Polimera-2 Movie | ఈ సారి థియేటర్లలో భయపెట్టేందుకు రెడీ అవుతున్న పొలిమేర-2.. రిలీజ్ ఎప్పుడంటే?
Maa Oori Polimera-2 Movie Release Date | తొలి పార్టుకు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్‌ను ఎట్టి పరిస్థుతుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని మేకింగ్‌కు కాస్త ఎక్కువ ఖర్చే పెట్టారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Maa Oori Polimera-2 Movie Release Date | రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్ నటనైతే వేరే లెవల్. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సీక్వెల్‌ను వెంటనే ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ గట్రా సీక్వెల్‌పై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి.
తొలి పార్టుకు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్‌ను ఎట్టి పరిస్థుతుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని మేకింగ్‌కు కాస్త ఎక్కువ ఖర్చే పెట్టారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు. చేతబడి చేసే వారు ధరించే దండలను చూపిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలాదిత్య మరో ప్రధాన పాత్రలో నటించాడు. డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ, చిత్రమ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండియర్‌గా రూపొందించాడు.
ఇక సీక్వెల్ పార్టు తొలిభాగానికి మించి ఉండనున్నట్లు టీజర్‌తో స్పష్టం చేశారు. రెండో భాగంలో చేతబడిని మరింత క్రూరంగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తొలిపార్టు మొత్తం ఒక ఊరిలోనే సాగగా.. సెకండ్ పార్ట్ మాత్రం పలు లొకేషన్లలో తెరకెక్కించారు. కావాల్సిన బజ్ క్రియేట్ చేస్తే మట్టుకు పొలిమేర-2కు భారీ ఓపెనింగ్స్ రావడం పక్కా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

