Maa Oori Polimera 2 | నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన `మా ఊరి పొలిమేర -2`
Maa Oori Polimera 2 | కొత్తకాన్పెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పోలిమేర (Maa Oori Polimera). ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.
Maa Oori Polimera 2 | కొత్తకాన్పెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పోలిమేర (Maa Oori Polimera). ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పోలిమేరకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘మా ఊరి పోలిమేర 2′ (Maa Oori Polimera 2). చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్(Satyam Rajesh), డా.కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhakskarla), గెటప్ శ్రీను (Getup Srinu), రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.

Maa Oori Polimera 2
ఈ సందర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంతటి ఘనవిజయం అందుకుందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్‌పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో చేశాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 3న మా చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

Satyam Rajesh
దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ…“గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించాం. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉండబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఈ చిత్రంలో జోడించాం. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా వుంటుంది. వాట్ నెక్ట్స్ అనేది ఎవరూ ఊహించలేరు. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశాము. సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారు. నవంబర్ 3న మా సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది“ అన్నారు.

Kamakshi Bhasksar
ఈ చిత్రానికి సంగీతంః గ్యాని, సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఎడిటింగ్ః శ్రీ వర; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఫైట్ మాస్టర్ః రామ్ మాస్టర్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

