Chandramohan | నటుడిగా చంద్రమోహన్ ప్రాధాన్యత ఎనలేనిదని: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
Chandramohan | సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
Chandramohan | సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. కాగా, ఆయన మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా ఆయన ప్రాధాన్యత ఎనలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.
ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/UrH5WGIE7L
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) November 11, 2023
ఆయన అకాల మరణం బాధించింది: ఎన్టీఆర్
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దించారు.
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) November 11, 2023
విలక్షణ నటుడు చంద్రమోహన్: కల్యాణ్‌రామ్
విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటని నందమూరి కల్యాణ్‌రామ్ అన్నారు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు.
ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 11, 2023
ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు: బాలకృష్ణ
జీవితం క్షణికం, జీవం పోసిన పాత్రలు శాశ్వతమని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. అలాంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన మన అలనాటి అభిమాన నటుడు చంద్రమోహన్ ఇక లేరంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జీవితం క్షణికం, జీవం పోసిన పాత్రలు శాశ్వతం, అలాంటి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన మన అలనాటి అభిమాన నటుడు చంద్రమోహన్ గారు ఇక లేరు.#Chandramohan#OmShanti pic.twitter.com/bRkBKw3KdO
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) November 11, 2023
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర: ఏపీ సీఎం జగన్
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
విలక్షణ నటుడు చంద్రమోహన్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. కుటుంబ కథా చిత్రాలంటే చంద్రమోహన్ గారే అన్నట్లుగా.. సాగిన వారి నటనా జీవితం, పొందిన అవార్డులు యువ నటీనటులకు ఆదర్శం. ద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్య కారణాలతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. కుటుంబ కథా చిత్రాలంటే చంద్రమోహన్ గారే అన్నట్లుగా.. సాగిన వారి నటనా జీవితం, పొందిన అవార్డులు యువ నటీనటులకు ఆదర్శం.
చంద్రమోహన్… pic.twitter.com/ZC0isliFzr
— G Kishan Reddy (@kishanreddybjp) November 11, 2023
తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: నారా లోకేశ్
సీనియర్ నటులు చంద్రమోహన్ మృతి బాధాకరమని నారా లోకేశ్ అన్నారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన ఆయన మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు.
సీనియర్ నటులు చంద్రమోహన్ గారి మృతి బాధాకరం. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల… pic.twitter.com/ilKNoPhAfE
— Lokesh Nara (@naralokesh) November 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

