Anupama Parameswaran | రొమాంటిక్ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్
ప్రేమమ్' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. అందానికి తోడు అద్భుత నటన, ఆకట్టుకునే అభినయం, ఆశ్చర్యచకితులను చేసే హావభావాలు పలికించడంలో తనకు తానే సాటి ఈ భామ. తనకు ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోతూ తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు దగ్గరైందీ అమ్మడు.
Anupama Parameswaran | ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. అందానికి తోడు అద్భుత నటన, ఆకట్టుకునే అభినయం, ఆశ్చర్యచకితులను చేసే హావభావాలు పలికించడంలో తనకు తానే సాటి ఈ భామ. తనకు ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోతూ తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు దగ్గరైందీ అమ్మడు. ప్రధానంగా మలయాళం, తెలుగు చిత్రాలపై దృష్టి సారిస్తుంటుంది. మూడేళ్ల తర్వాత తమిళంలో ఆమె నటించిన తన మూడో సినిమా ‘సైరెన్’. ఈ చిత్రంలో జయం రవి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ సింగిల్ జనవరి 29న విడుదలైంది. ‘నేట్రు వరై’.. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ లిరిక్స్ సగటు ప్రేక్షకుల మదిని తట్టిరేపుతున్నాయి. తమరై సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరాం ఆలపించారు.
ఈ ‘నేట్రు వరై’ గీతాన్ని జోడిస్తూ పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు అనుపమ పరమేశ్వరన్. “పెళ్లికూతురుగా ‘నేట్రు వరై’ వింటూ కొంచెం ఉత్సాహంగా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సొగసరికి చెందిన రెండు తెలుగు (ఈగల్, టిల్లు స్కేర్), ఒక తమిళ (సైరెన్) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రవితేజ, కావ్యా థాపర్, అనుపమ పరమేశ్వరన్ తదితర తారాగణంతో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగల్’ ఫిబ్రవరి 9న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన మరో చిత్రం ‘టిల్లు స్వేర్’లోనూ ఆమె సిద్ధు జొన్నలగడ్డతో జతకట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

