లవ్ యువర్ ఫాదర్ ప్రారంభం
శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్'. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్’. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ విద్యాసంస్థల నిర్వాహకురాలు చామకూర శాలిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్‌రెడ్డి క్లాప్ కొట్టారు.
తండ్రీకొడుకుల బంధం, భావోద్వేగాలను ఈ సినిమాలో సరికొత్తగా చూపించనున్నామని నిర్మాత మహేశ్ రాఠీ తెలిపారు. ప్రతి ఒక్కరికి తాను నమ్ముకున్న దేవుడి తర్వాతి స్థానం తండ్రిదేనని, తన తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ తనతో ఉంటాయని చెప్పారు. కిశోర్ రాఠీ గారి జీవితంలోని చిన్న సంఘటనను తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని తండ్రీకొడుకుల ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
‘శివోహం’ లాంటి మంచి కాన్సెఫ్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో ఎస్పీ చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణీంద్ర కుమార్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: కిశోర్ రాఠీ, మహేశ్ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి, దర్శకత్వం: పవన్ కేతరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

