Love Today Movie | ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ లవ్‌టుడే మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ సినిమాల హవా నడుస్తుంది. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు.
Love Today Movie On OTT | ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ సినిమాల హవా నడుస్తుంది. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నాయి. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు. కథ గొప్పగా ఉండి ప్రేక్షకుడిని కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటే సరే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుంది. ఈ కోవలోకే ఇటీవలే రిలీజైన ‘లవ్‌టుడే’ సినిమా చేరుతుంది. ఎలాంటి అంచనాల్లేకుండా నవంబర్ 4న తమిళంలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 5కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళంలో వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించి ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో దిల్‌రాజు తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశాడు. మొదటి రోజు నుండి ఈ సినిమా భారీ వసూళ్ళను రాబడుతూ ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రదీప్, ఇవానా నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ మూవీ తమిళ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇక తెలుగు వెర్షన్ క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని చిత్రబృందం భావిస్తుందట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రదీప్ తన మూడో సినిమాను విజయ్‌తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రదీప్ ఓ సై-ఫై యాక్షన్ కథను విజయ్‌కు నెరేట్ చేశాడట. కథ నచ్చడంతో ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

