Love Today Movie Release date | ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం అలా ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి ఘన విజయాలు సాధించాయి. ఈ క్రమంలో తమిళంలో బ్లాక్‌బస్టర్ వసూళ్ళతో దూసుకుపోతున్న లవ్‌టుడే సినిమాను తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దాంతో దిల్‌రాజు తెలుగులో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ దేవరకొండతో తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేయించాడు. లైటెస్ట్గా రిలీజైన ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. నేటి సమాజంలో లవ్ అనేది ఎలా ఉంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్లో చూపించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 25న తెలుగు వెర్షన్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున అల్లరినరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై కూడా విపరీతమైన బజ్ ఉంది. మరి అల్లరినరేష్ పోటీను తట్టుకుని ఈ డబ్బింగ్ సినిమా నిలబడుతుందా? లేదా? అనేది చూడాలి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా రవి హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, రాధికా కీలకపాత్ర పోషించారు.
ఈ సినిమా కథ ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రేమికులు వాళ్ల ప్రేమను పెళ్ళివరకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో అబ్బాయి, అమ్మాయి వాళ్ల నాన్నతో పెళ్లి గురించి మాట్లాడాలని ఆయన్ని కలుస్తాడు. అయితే అమ్మాయి తండ్రి వీళ్ళిద్దరికి ఓ టెస్ట్ పెడతాడు. వీరిద్దరిని ఒకరి ఫోన్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోని ఒక రోజు ఉండమంటారు. మరుసటి రోజు కూడా పెళ్ళి చేసుకుందాం అనుకుంటే తనకు డబుల్ ఓకే అని చెప్తాడు. దాంతో ఈ ఇద్దరు ప్రేమికులు బయపడుతూనే ఒకరి ఫోన్ మరోకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మెల్లిగా ఒకరి పర్సనల్ విషయాలు మరోకరికి తెలిసిపోతుంటాయి. ఈ క్రమంలో వారిద్ధరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు పెళ్లి వరకు తీసుకెళ్తాయా.. లేదా మధ్యలోని పెళ్లి పెటాకులవుతుందా అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.