Love Today Movie | టెలివిజన్‌లోనూ అదరగొట్టిన లవ్‌టుడే మూవీ.. రికార్డు టీఆర్పీ నమోదు
Love Today Movie TRP Rating | ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కంటెంట్ సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నాయి. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ సినిమాలను కోరుకుంటున్నారు.
Love Today Movie TRP Rating | ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కంటెంట్ సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నాయి. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ సినిమాలను కోరుకుంటున్నారు. కథ గొప్పగా ఉండి ప్రేక్షకుడిని కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటే సరే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. గతేడాది రిలీజైన లవ్‌టుడే సినిమా కూడా ఇదే విధంగా కోట్లు కొల్లగొట్టింది.
కేవలం 5కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళంలో వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించి ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో దిల్‌రాజు తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశాడు. మొదటి రోజు నుండి ఈ సినిమా భారీ వసూళ్ళను రాబడుతూ ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రతీప్ రంగనాథన్ నటుడిగా, దర్శకుడిగా వంద మార్కులు కొట్టేశాడు. యూత్‌కు మంచి మెసేజ్ ఇస్తూనే కావాల్సినంత ఎంటర్టైనమెంట్ ఉండటంతో జనాలు విపరీతంగా ఆదిరించారు.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమా రెండు వారాలు పాటు టాప్ ట్రెండింగ్స్‌లో కొనసాగింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అయింది. కాగా ఈ మూవీ 6.1 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసింది. ఈ మధ్య బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు సైతం ఈ రేంజ్ టీఆర్పీని సాధించలేకపోతున్నాయి. అలాంటిది ముఃఖ పరిచయంలేని నటులతో రూపొందిన ఈ సినిమా ఆ రేంజ్ టీఆర్పీ రేటింగ్ సాధించడంటే మాములు విషయం కాదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

