Love Today Movie | అప్పుడే ఓటీటీలోకి లవ్‌టుడే మూవీ.. కానీ?
ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయం సాధించాయి.
Love Today Movie On OTT | ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన లవ్‌టుడే సినిమా కూడా తెలుగులో భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రూ.5 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళంలో రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక తెలుగులో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది.
ఈ సినిమాను డిసెంబర్ 2నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ చిత్రం కేవలం తమిళ భాషలోనే రిలీజవుతుంది. తెలుగులో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండటంతో మరో రెండు మూడు వారాల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావించారట. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు రిలీజ్ చేశాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా రవి నటించింది. సత్యరాజ్, రాధికా కీలకపాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

