Love Story: ఏఎమ్‌బీ సినిమాస్‌లో రికార్డ్ బద్దలు కొట్టిన లవ్ స్టోరీ

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. విడుదలైన అన్ని థియేటర్స్‌లో ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 251 షో లు లవ్ స్టోరీ ని ఏఎంబీలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తంగా 48233 మంది లవ్ స్టోరీ సినిమాను చూశారు.
సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద విజయంగా నిలిచిన లవ్ స్టోరీ చిత్రం ఆహా స్ట్రీమింగ్ కు కూడా సిద్దం అయింది. థియేటర్ రన్ ఆల్ మోస్ట్ ముగియనుండడంతో ఈ సినిమా అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది.
మంచి కాన్సెప్ట్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ చిత్రం ఆకట్టుకునే కథ మరియు కథనాలతో సాగింది.
సాయి పల్లవి మరియు నాగ చైతన్యల కాంబోకు మంచి మార్కులు పడ్డాయి. ఆకట్టుకున్న స్టార్ కాస్టింగ్ కు తోడు పాటలు కూడా చక్కగా కుదిరాయి. మొత్తంగా శేఖర్ కమ్ముల ఒక మంచి సినిమాను కాస్త ఆలస్యం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amb
- love stroy
- naga chaitanya
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

