అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా నటిస్తున్న రూరల్ లవ్‌స్టోరీ ‘లవ్ జాతర’. గోపీనాథ్‌రెడ్డి దర్శకుడు. కంకణాల ప్రవీణ నిర్మాత. హీరో అంకిత్ కొయ్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ..
ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న త్రివిక్రమ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. కొత్త హెయిర్ ైస్టెల్‌తో, క్యాజువల్ వేర్లో క్యూరియస్‌గా కనిపిస్తున్న అంకిత్‌ను ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చేతన్ భరద్వాజ్.