‘శేఖర్’కు లవ్ గంట మోగిందంట

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘లవ్ గంటే మోగిందంట.. తొలి ప్రేమే పుట్టిందంటా’ అనే గీతాన్ని బుధవారం విడుదలచేశారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్ అనూప్, రేవంత్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ హత్య కేసు అన్వేషణలో రిటైర్డ్ పోలీస్ అధికారి తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. ఇటీవల విడుదలచేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఆత్మీయరజన్, ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

