Ram Charan| టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15గా వస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆర్సీ 16 రెగ్యులర్ షూటింగ్ మార్చి రెండోవారం నుంచి షురూ కానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఈ ఫొటోలు కూడా నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా దిగిన ఫొటోలను నిన్న రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు రాంచరణ్. ఆర్సీ 16 కోసం ఎదురుచూస్తున్నా.. అని క్యాప్షన్ ఇచ్చాడు. ఒక ఫొటోలో సుకుమార్, బుచ్చిబాబు సాన, మైత్రీ మూవీ మేకర్స్ టీం, బోనీకపూర్ అండ్ హీరోహీరోయిన్లుండగా.. మరో స్టిల్‌లో చరణ్, జాన్వీ చిట్ చాట్ చూడొచ్చు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు చరణ్ RC17 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త కూడా మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. సుకుమార్ (Sukumar) హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాంచరణ్ పుట్టినరోజైన మార్చి 27న అధికారిక ప్రకటన ఉండబోతుందట. మరి ఈ సారి సుకుమార్-రాంచరణ్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు మార్చి 27న రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు పాపులర్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారని తెలుస్తోంది.
ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడని ఇన్సైడ్ టాక్. సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఆర్సీ 16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే ఆర్సీ 16, ఆర్సీ 17 అప్డేట్స్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు.
News is that @AlwaysRamCharan has signed @SukumarWritings ‘s next. Can’t wait!#rc17 #siddharthkannan #sidk pic.twitter.com/4605scV71B
— Siddharth Kannan (@sidkannan) March 21, 2024
The most awaited project is all set to take off on an auspicious note❤️#RC16PoojaCeremony tomorrow at 10.10 AM.#RamCharanRevolts #RC16
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/AgDo1lgK0T— RC 16 (@RC16TheFilm) March 19, 2024
Our Next #RC16 Director 📸✨ @BuchiBabuSana and Assistant Director Ramana with Our MAN OF MASSES @AlwaysRamCharan 🦁👑🔥🤩
RAW & RUSTIC #RamCharanRevolts LOADINGGGGG 💯🔥💥#ManofMassesRamCharan #RamCharan pic.twitter.com/NayCeAevqK
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 4, 2024
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023