Vikram Movie | ‘ఖైదీ’ తరహాలోనే ‘విక్రమ్’ మూవీ.. క్లారిటీ ఇచ్చిన లోకేష్కనగరాజ్!
Vikram Movie | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘విక్రమ్’ ఒకటి. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు నటించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా లోకేష్ కనగరాజ్ చిత్రం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కమల్ ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం కూడా ఖైదీ తరహాలోనే ఒక రాత్రి జరిగే కథ అని తెలిపాడు. దాంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

