Thalaivar170 | రజనీకాంత్ కోసం కొత్త ప్రయోగం చేస్తున్న లోకేష్ కనకరాజ్
Thalaivar170 | ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ . కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Thalaivar170 | ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ . కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేయబోతున్నారు లోకేష్. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమమైన విషయాలు చెప్పారు లోకేష్.
లోకేష్ కనకరాజ్ తన ప్రతి సినిమా కథకి ముడి పెడుతూ ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ క్రియేట్ చేసిన సంగతి తెలిసింది. రజనీకాంత్‌తో చేయబోయే చిత్రం మాత్రం ఇందులో భాగంగా వుండదు. ఈ సినిమా కోసం చాలా కొత్త ప్రయోగం చేస్తున్నారట లోకేష్. ఆ ప్రయోగం తనకి కూడా కొత్తదేనని, ఇలాంటి ఫార్మెట్ లో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఏదీ రాలేదని, తన గత సినిమాలకి, రజనీకాంత్ సినిమాలకి .. ఇది పూర్తిగా కొత్తగా వుండే సినిమాని, ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే ఆసక్తి తనలో వుందని చెప్పుకొచ్చారు లోకేష్. లియో విడుదలైన వారం రోజుల తర్వాత రజనీ సినిమా ప్రీప్రొడక్షన్ మొదలౌతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

