జెస్సీ ఆటను సరిగా అర్ధం చేసుకోకుండా ఆడినందుకు కెప్టెన్సీటాస్క్లో అనర్హుడిగా ప్రకటించారు బిగ్ బాస్.దీంతో షణ్ముఖ్ తెగ ఫీలయ్యాడు. ఇద్దరూ కలిసి తనను ఎదవను చేశాడంటూ షన్ను ఫీలయ్యాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు అని షన్ను తెగ హర్ట్ అయ్యాడు.
షణ్ముఖ్ పక్కన కూర్చొని వివరణ ఇచ్చే ప్రయత్నం సిరి చేస్తుండగా, ఇక్కడ నుండి వెళ్లిపో అని చెప్పాడు షణ్ముఖ్. షన్ను అన్న మాటలకు జెస్సీ కూడా హర్ట్ అయినట్టున్నాడు. షన్ను పక్కన ఉన్న బెడ్‌ను ఖాళీ చేసి వేరే బెడ్‌ను వెతుక్కున్నాడు. ఇక సీక్రెట్ రూంలో ఉన్న లోబోహౌజ్లోకి తిరిగి రావడంతో అందరిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది.
గేట్ దగ్గర లోబో కనబడగానే రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. ఈ సమయంలో త్రిమూర్తులు(షణ్ముఖ్, సిరి, జెస్సీ) ఇంట్లోనే ఉండగా.. మిగిలిన సభ్యులంతా గార్డెన్ ఏరియాకు వచ్చి లోబోకి స్వాగతం పలికారు. అయితే రీఎంట్రీ ఇచ్చిన లోబోకి ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అతనికి బ్లాక్, గొల్డెన్ ఎగ్స్ ఇచ్చాడు. వాటిద్వారా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన ఐదుగురిలో నుంచి ఒకరిని తొలగించొచ్చు. మరొకొరిని కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు అని అన్నారు బిగ్ బాస్.
కెప్టెప్సీ టాస్క్‌లో నుండి శ్రీరామ్‌ని తొలగించి, కాజల్‌ని కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక చేశాడు.ఇక లోబో తాను సీక్రెట్ రూంని ఏమేమి గమనించాడో అవన్నీరవితో షేర్ చేసుకున్నాడు. దీంతో రవిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఇక నుండి మన గేమ్ వేరేలా ఉంటుందని చిటికలేస్తూ చెప్పాడు