LOBO:ఎనిమిదో వారం ఎలిమినేట్ అయిన లోబో.. వాళ్లే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కామెంట్

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా 8 వారాలు పూర్తి చేసుకుంది. గతంలో ఎలిమినేట్ అయిన ఏడుగురు కంటెస్టెంట్స్‌లో ఆరుగురు మహిళలే కాగా, ఎనిమిదో వారం కూడా మహిళా కంటెస్టెంట్‌ని బయటకు పంపుతారేమో అని అందరు అనుకున్నారు. కాని లోబోని ఎలిమినేట్ చేశారు. గత వారం సీక్రెట్ టాస్క్ అంటూ లోబోని బయటకు తీసుకొచ్చారు.ఈ వారం నిజంగానే ఎలిమినేట్ చేశారు.
మొదట్లో లోబో తనదైన కామెడీతో నవ్వులు పంచాడు. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అలరించాడు. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయేవాడు. టాస్క్‌ల సందర్భంగా తనవంతు కృషి చేసేవాడు. ‘వెయిట్‌లాస్’ టాస్క్ సందర్భంగా నట్రాజ్ కోసం ఏమీ తినకుండా లోబో నిగ్రహంగా ఉండటం హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేసిన చివరి వారం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో హౌజ్‌మేట్స్ ఆయనను ఎలిమినేట్ చేశారు.
ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన లోబోతో ఐదుగురు మిత్రువులు- ఆరుగురు శత్రువులు గేమ్ ఆడించాడు నాగార్జున. ఈ సందర్భంగా లోబో.. తొలుతగా ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాకు ఎల్లప్పుడూ బూస్ట్ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే కాజల్, సన్నీ, రవి కూడా తన మిత్రువులేనని పేర్కొన్నాడు. ఇక ఐదో ఫ్రెండ్ యానీ గురించి చెప్తూ ఆమె కెప్టెన్ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానన్నాడు. మిగతా వారు కూడే మంచి వాళ్లే అని చెప్పి హౌజ్‌ని వీడాడు లోబో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

