Little Hearts | ఓటీటీలోను దూసుకెళుతున్న లిటిల్ హార్ట్స్ ..200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దిశగా ఫీల్ గుడ్ మూవీ
Little Hearts | సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. థియేటర్స్‌లో ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇక ఓటీటీలోను ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను టచ్ చేసే దిశగా పరుగులు తీస్తోంది.
Little Hearts | సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. థియేటర్స్‌లో ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇక ఓటీటీలోను ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను టచ్ చేసే దిశగా పరుగులు తీస్తోంది. మౌళి, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సింపుల్ లవ్ స్టోరీతో పాటు ఎమోషన్, కామెడీ, కుటుంబ విలువలు అన్నీచక్కగా సరిపోవడం ఈ సినిమా విజయానికి కీలకంగా మారాయి. థియేటర్ రిలీజ్ సమయంలోనే ఈ చిత్రం మంచి రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు అదే ఊపును డిజిటల్ వేదికపై కొనసాగిస్తూ, కంటెంట్ బలంగా ఉంటే అది సినిమాను నిలబెట్టగలదని మరోసారి రుజువు చేస్తోంది. సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రల మధ్య రిలేషన్, సన్నివేశాల ట్రీట్మెంట్, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ నేచురల్‌గా ఉండటంతో ప్రేక్షకులు చిత్రంతో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎలాంటి హంగామా లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగిన సినిమాగా “లిటిల్ హార్ట్స్” నిలుస్తోంది. వారంవారం మారిపోయే టాలీవుడ్ ట్రెండ్స్‌లో, నిశబ్ద విజయం సాధిస్తున్న “లిటిల్ హార్ట్స్” వంటి సినిమాలు, వ్యూయర్ మూడ్‌కు తగ్గట్లుగా, ఎప్పుడైనా చూసేలా ఉండే కంటెంట్‌తో ఉంటే ఎంతటి విజయాన్ని సాధించగలవో చూపిస్తున్నాయి.
ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం, ఇంకెన్ని రికార్డులు సాధించబోతుందో చూడాల్సిందే. ప్రేమ, భావోద్వేగాలు, నవ్వులు… అన్నింటినీ ఒకే చోట చుట్టి అందించిన ఈ సినిమా, కొత్తగా, క్లీన్‌గా ఓ మంచి కథను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు తప్పకుండే చూడదగిన ఎంపిక అని చెప్పొచ్చు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించాడంటే చిత్రం ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

