Leo | విజయ్ క్రేజ్‌కు స్టన్ అవ్వాల్సిందే.. లియో ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలిస్తే షాకే..!
Leo | విజయ్ (Vijay) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా లియోకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లియో (Leo.. Bloody Sweet). స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా లియోకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. లియో ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం లియో ఓవర్సీస్ హక్కులు రూ.60 కోట్లు అమ్ముడుపోగా.. లీడింగ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ Phars Film ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఫిగర్ తమిళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ ఓవర్సీస్ డీల్ కావడం విశేషం.
అంతేకాదు సలార్, ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యధిక ఓవర్సీస్ డీల్ దక్కించుకున్న మూడో సినిమాగా నిలిచినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. ఓవర్సీస్లో ఇదివరకెన్నడూ విడుదల చేయని విధంగా లియోను లాంఛ్ చేయబోతున్నట్టు ఫార్స్ ఫిలిం ప్రతినిధి చెప్పారు. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.
లియోలో మలయాళ భామ శాంతి మాయాదేవితోపాటు బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ రాస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా అవడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

