Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ కూడా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ఫస్ట్ డే బుకింగ్స్ రికార్డును ‘లియో’ సినిమా.. బద్దలు కొట్టింది. జవాన్ మొదటి రోజు 15.75 లక్షల టిక్కెట్లు అమ్ముడవ్వగా.. లియో మొదటి రోజే 16 లక్షల టిక్కెట్లను విక్రయించినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా ఒక్క తమిళంలోనే దాదాపు 13.75 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో 2.10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌తో పాటు త్రిష, సంజయ్ దత్, అర్జున్, శాండీ, మిష్కిన్, గౌతమ్ మీనన్ తదితరులు నటించారు.