Raghava Lawrance | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..!
Raghava Lawrance | తమిళ నటుడు రాఘవ లారెన్స్‌కు రజనీకాంత్ అంటే అమితమైన అభిమానం. ఎన్నో సందర్భాల్లో లారెన్స్ రజనీపై తన అభిమానాన్ని చాటి చెప్పాడు. అంతేకాకుండా లారెన్స్ కూడా తరచూ రజనీను కలుస్తూ ఆయన ఆశీస్సులు తీసుకుంటుంటాడు. కాగా తాజాగా చంద్రముఖి సీక్వెల్ రిలీజవుతున్న సందర్భాంగా లారెన్స్.. రజనీని కలిసి ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
Raghava Lawrance | తమిళ నటుడు రాఘవ లారెన్స్‌కు రజనీకాంత్ అంటే అమితమైన అభిమానం. ఎన్నో సందర్భాల్లో లారెన్స్ రజనీపై తన అభిమానాన్ని చాటి చెప్పాడు. అంతేకాకుండా లారెన్స్ కూడా తరచూ రజనీను కలుస్తూ ఆయన ఆశీస్సులు తీసుకుంటుంటాడు. కాగా తాజాగా చంద్రముఖి సీక్వెల్ రిలీజవుతున్న సందర్భాంగా లారెన్స్.. రజనీని కలిసి ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను లారెన్స్ అభిమానులతో పంచుకున్నాడు. అందరికీ నమస్కారం. ఈ రోజు నా గురువు రజనీకాంత్‌ను కలిసి ఆయనకు జైలర్ సక్సెస్ శుభాకాంక్షలు తెలిపాను. అదే విధంగా చంద్రముఖి రిలీజవుతున్న సందర్భంగా ఆయన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటూ రాసుకొచ్చాడు.
ఇక ఈ సినిమా షూటింగ్‌కు ముందు కూడా ఇలానే రజనీను కలిసి ఆయన నుంచి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇక మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న చంద్రముఖి సీక్వెల్‌పై జనాల్లో మాములు అంచనాల్లేవు. తొలి ట్రైలర్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రీసెంట్గా రిలీజైన సెకండ్ ట్రైలర్ మంచి హైప్‌ను తీసుకొచ్చింది. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకు వాసు.పి దర్శకుడు. కంగనా రనౌత్, ఎమ్.ఎమ్ కీరవాణి వంటి దిగ్గజాలు సినిమాలో భాగం కావడంతో సీక్వెల్ పార్టుపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి.
కాగా ఈ సినిమాకు పోటీగా స్కంద, పెదకాపు, గాడ్ వంటి సినిమాలు తెలుగులో రిలీజవుతున్నాయి. అయితే చంద్రముఖి హార్రర్ జోనర్‌గా కాబట్టి జనాలు కాస్త కనెక్ట్ అయినా బంపర్ హిట్టు కావడం పక్కా.
Hi friends and fans,
Today I met my Thalaivar and Guru @rajinikanth to wish him for jailer’s blockbuster success and got blessings for #Chandramukhi2 release on September 28th. I’m so happy. Thalaivar is always great. Guruve Saranam 🙏🏼🙏🏼 pic.twitter.com/kXB00aiImw— Raghava Lawrence (@offl_Lawrence) September 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

