Lavanya Tripathi | ‘హ్యపీ బర్త్‌డే’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Happy Birthday Trailer Date | టాలీవుడ్లో గత రెండు మూడేళ్ళ నుండి కంటెంట్ సినిమాలకు విశేష స్పందన వస్తుంది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? అనే దాన్ని పక్కన పెట్టి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాలు ఊహించని స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తువదలరా’ చిత్రం కూడా ఈ కోవలోకి చెందిందే. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. రితేష్ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2019లో విడుదలైన బెస్ట్ చిత్రాలలో మత్తువదలరా ఒకటిగా నిలిచింది. మళ్ళీ ఇప్పటివరకు ఈ దర్శకుడి నుండి సినిమా రాలేదు. ఈ క్రమంలో రితేష రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్యపి బర్త్‌డే’ సినిమా తెరకెక్కించాడు.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వివేక్ అగస్థ్య కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా ఇటీవలే వారం రోజులు ముందుకు ప్రీ పోన్ చేస్తూ జూలై 8న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఇప్పటికే మేకర్స్ సినిమాను విభిన్న పద్ధతిలో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులలో సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయింత్రం 4.05 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Enter the entertaining #HappyBirthday party and get your funny bones tickled 🥳#HBDMovie Trailer tomorrow at 4:05 PM 💥#HBDMovieOnJuly8 @Itslavanya @RiteshRana @vennelakishore @nareshagastya #Satya @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt @MythriOfficial pic.twitter.com/d9SiiVd0ck
— Maduri Mattaiah (@madurimadhu1) June 28, 2022
Enter the entertaining #HappyBirthday party and get your funny bones tickled 🥳#HBDMovie Trailer tomorrow at 4:05 PM 💥#HBDMovieOnJuly8 @Itslavanya @RiteshRana @vennelakishore @nareshagastya #Satya @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt pic.twitter.com/bYiOfDVBnZ
— Mythri Movie Makers (@MythriOfficial) June 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

