Lal Salam Movie | పదేళ్ల క్రితం ‘3’ అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. కమర్షియల్‌గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ చాలా మందికి ఈ మూవీ ఫేవరైట్. ఈ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని వాయ్ రాజా వాయ్ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించింది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు కాసుల వర్షం కురిసింది. ఆ తర్వాత ఒక డాక్యుమెంటరీ ఫిలిం తెరకెక్కించింది. కానీ అది అంతగా ఆధరణ పొందలేకపోయింది. కాగా ఐశ్వర్య మళ్లీ దాదాపు ఆరేళ్ల తర్వాత మెగాఫోన్ పడుతుంది.
లైకా ప్రొడక్షన్ సంస్థలో లాల్ సలాం అనే స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేస్తుంది. ఇప్పటికే ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. రజనీకి చెల్లెలిగా జీవితా రాజశేఖర్ కనిపించబోతుంది. స్వరాల మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Lights 💡
Camera 🎥 🎬
Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌
Happy #HOLI everyone! 💫🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🤝 @gkmtamilkumaran
🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod— Lyca Productions (@LycaProductions) March 7, 2023