Lal Salaam | ప్రజలు కుల, మత భేదాభిప్రాయం లేకుండా ఆనందంగా జీవిస్తున్న భారతదేశంలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం మనలో మనకు గొడవలు పెట్టారు. ఇలాంటి చెడు పరిణామాల నుంచి ప్రజలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో ఒకడు మొయిద్దీన్ భాయ్. ఈ మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు.
ఈ నెల 9న తెలుగులో శ్రీలక్ష్మీ మూవీస్ విడుదల చేస్తున్నది. ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’.. అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏఆర్.రెహమాన్.