నాగశౌర్య కథానాయకుడిగా క్రీడా నేపథ్య ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘సయా సయా’ అనే లిరికల్ గీతాన్ని శనివారం యువహీరో నాగచైతన్య విడుదల చేశారు. ‘ఆకాశమే తలేఎత్తనే..నా ప్రేమ కొలిచేందుకే.. భూగోళమే పెంచే వేగమే నిను నన్ను కలిపేందుకే…సయా సయా సయా..నిశీధినే అయా…’ అంటూ చక్కటి సాహిత్యంతో ఈ గీతం ఆకట్టుకుంది. ఇందులో నాయకానాయికలు నాగశౌర్య, కేతికాశర్మ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ‘విలువిద్య నేపథ్యంలో ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగే చిత్రమిది. ఆర్చర్‌గా నాగశౌర్య పాత్ర భిన్న పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, సచిన్‌ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి, సంగీతం: కాళభైరవ, నిర్మాతలు: నారాయణ్‌దాస్ కె నారంగ్, పూస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి.