సీనియర్ హీరో మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అగ్ని నక్షత్రం’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్, విశ్వంత్, చైత్ర శుక్ల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, యాక్షన్ సీన్స్ ఆకర్షణ అవుతాయని దర్శకుడు వంశీ కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : అచ్చు రాజమణి.