నాగార్జున కెరియర్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన చిత్రాలలో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ కలసి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కళ్యాణ్ కృష్ణ మూవీకి ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని చూస్తున్న క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ పెంచారు.
అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుండా అంటూ సాగే ఈ మొదటి పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో నాగార్జున తెగ ఎంజాయ్ చేసుకుంటూ పాట పాడారు.ధనుంజయ్ ఆయనతో జత కట్టారు. అనూప్ బాణీలకు ధనుంజయ్, నాగార్జున గళం తోడు కావడంతో పాట అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పాట ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకుంటుంది.
‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.