‘డబ్బుంటే చాలు జీవితంలోని సగం కష్టాలకు ఫుల్స్టాప్ పడ్డట్లే. ఖాళీ పర్స్‌తో బయట అడుగుపెట్టాలంటే ఫ్రస్ట్రేషన్‌గా ఫీలవుతుంటాం. జీవితం బండికి డబ్బే ఇంధనం అయిన ఈ రోజుల్లో..మనీ లేకుంటే మనసంతా ఫ్రస్ట్రేషనే. ఈ పాయింట్‌ను మా సినిమాలో వినోదాత్మకంగా ఆవిష్కరించాం’ అని చెప్పారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ కథానాయికలు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో ఈ సినిమాలోని తొలి గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు..’ అంటూ సాగే ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి గురించి తెలియజెప్పారు. భాస్కరభట్ల సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని రామ్ మిర్యాల ఆలపించారు. ‘డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. కథలోని సారాన్ని ఈ పాటలో ఆవిష్కరించాం. ఆద్యంతం చక్కటి హాస్యంతో అందరిని అలరించే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి.