Kurma Nayaki | వరలక్ష్మీ ‘కూర్మ నాయకి’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. హాలీవుడ్ తరహాలో
Kurma Nayaki | తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కూర్మ నాయకి’(Harshavardhan). ఈ సినిమాకు కె.హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. కాలభైరవ ప్రొడక్షన్స్, ఎం ఎం క్రియేషన్స్ బ్యానర్లపై కె.విజిత రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Kurma Nayaki | తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కూర్మ నాయకి’(). ఈ సినిమాకు కె.హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. కాలభైరవ ప్రొడక్షన్స్, ఎం ఎం క్రియేషన్స్ బ్యానర్లపై కె.విజిత రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వినూత్నమైన సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా నేడు కూర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. హాలీవుడ్ తరహాలో ఉన్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. అన్ని వర్గాలను మెప్పించే కాన్సెప్ట్ ఇదని నిర్మాత కె.విజిత రావు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.హర్షవర్ధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

