Kubera Actress | టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం నటి సునయన వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన ప్రియుడితో విడిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో జరిగిన మార్పులు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.ఇటీవల విడుదలైన కుబేర చిత్రంలో కీలక పాత్ర పోషించి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సునయన, గత ఏడాది నుంచి దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. సినీ వర్గాల్లో కూడా వీరి సంబంధంపై చర్చలు జరిగాయి. అంతేకాకుండా కొద్ది నెలల క్రితం ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా తన నిశ్చితార్థాన్ని ప్రకటించినట్లు భావించారు.
అప్పుడు సునయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వ్యక్తి చేయి పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ, త్వరలోనే తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో పెళ్లి వార్త కూడా వినిపిస్తుందని చాలామంది భావించారు.అయితే తాజాగా పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. సునయన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, ప్రియుడితో ఉన్న పోస్టులు, సంబంధాన్ని సూచించే పలు చిత్రాలను తొలగించినట్లు నెటిజన్లు గుర్తించారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా? లేక నిజంగానే బ్రేకప్ జరిగిందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులను తొలగించడం తరచుగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సునయన కూడా తన సంబంధానికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో, పెళ్లికి ముందే ఈ ప్రేమకథకు ముగింపు పడిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రచారంపై సునయన స్పందించలేదు. ఆమె మౌనం పాటించడంతోనే ఈ వార్తలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. అభిమానులు కూడా అసలు విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, తెలుగులో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సునయన, ఆ తర్వాత ‘10th Class’, ‘మిస్సింగ్’, ‘వేటాడు వెంటాడు’, ‘ఎంతవరకు ఈ ప్రేమ’ , రాజ రాజ చోర, లత్తి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.