Krithi Shetty | కృతిశెట్టి సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా?
Krithi Shetty Celebrity Crush | సినీరంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన అదృష్టం కూడా ఉండాలి అని సినీనటులు అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకుపోతుంది. గతేడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ చిత్ర విజయంలో 50శాతం క్రెడిట్ కృతిశెట్టికే దక్కుతుంది. ఈ చిత్రంలో అందం, అభినయంతో కృతి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంతో కృతికి అవకాశాలు క్యూ కట్టాయి. టైర్2 హీరోలకు ఈమె కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే నానితో ‘శ్యామ్ సింగరాయ్’, నాగ చైతన్యతో ‘బంగార్రాజు’ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈమె రామ్ హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది వారియర్’లో హీరోయిన్గా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కృతి వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతుంది. ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో మీ సెలబ్రెటీ క్రష్ ఎవరు అని యాంకర్ అడుగగా.. దానికి కృతి స్పందిస్తూ ప్రస్తుతం తన సెలబ్రెటి క్రష్ శివకార్తికేయన్ అని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా తమిళం నేర్చుకోవడానికి శివ కార్తికేయన్ సినిమాలు చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘అచలుడు’ సినిమాలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

