Aa Ammayi Gurinchi Meeku Cheppali | కృతి శెట్టి కన్నా కూడా బేబమ్మగానే బాగా పేమస్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఆ తర్వాత తను శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలో నటించింది. తాజాగా.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది ఈ సుందరి.
ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ లుక్‌లోనే సుధీర్ బాబు, కృతి శెట్టి రొమాన్స్ మామూలుగా లేదు.
ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సుధీర్ బాబు.. ఈ అమ్మాయ గురించి ఇక నుంచి ఇంకా ఎక్కువ చెప్పుకుందాం అంటూ ట్వీట్ చేశాడు.
బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్య పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.