Krithi Shetty | కృతిశెట్టికి మరో బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?
Krithi Shetty | సినీరంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతారలు అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ధక్షిణాదిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా కృతికి మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ ధనుష్, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కృతిని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. కాగా ఇప్పటికే తమిళంలో సూర్య, బాలా ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి ప్రస్తుతం తెలుగులో రామ్‌తో ‘ది వారియర్’, సుధీర్ బాబుకు జోడిగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ సరసన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలలో నటిస్తుంది. ఈ మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

