Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Krithi Shetty | ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, బేబమ్మగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అందాల భామ కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
Krithi Shetty | ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, బేబమ్మగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అందాల భామ కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీ చిత్రసీమలో కథానాయికగా అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సమర్పణలో రూపొందుతున్న ‘హమ్ తేరే ప్యార్ మే’ సినిమాతో ఆమె బాలీవుడ్లో కథానాయికగా పరిచయం కానున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
‘హమ్ తేరే ప్యార్ మే’ సినిమాకు విధి ఘోడ్గావ్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత 17 ఏళ్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వ బృందంలో పనిచేస్తూ ‘సింగం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘గోల్మాల్’ వంటి చిత్రాలకు అసోసియేట్‌గా ఆమె సేవలందించారు. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు.రోహిత్ శెట్టి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా భారీ యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శెట్టి.. ఇప్పుడు ఒక ప్రేమకథను సమర్పిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. కొత్త దర్శకురాలి నేతృత్వంలో కృతి శెట్టి హిందీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారన్నది చూడాలి.
కృతి శెట్టికి బాలీవుడ్‌తో గతంలోనే పరిచయం ఉంది. హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే బేబమ్మగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.అయితే ఇటీవల దక్షిణాది చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన కృతి శెట్టి.. ఇప్పుడు పూర్తిస్థాయి కథానాయికగా హిందీ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. ‘హమ్ తేరే ప్యార్ మే’ ఆమె కెరీర్లో కీలకమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఆమె సరసన నటించే హీరో ఎవరనే విషయాన్ని చిత్రబృందం ఇంకా వెల్లడించాల్సి ఉంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు కృతి శెట్టి తెలుగులోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమె నటిస్తుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

