నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ అంశాలతో మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులు కాగా శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎడిటర్‌గా పేరున్న ఎం.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా నాయిక కృతిశెట్టి క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె స్వాతిగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల.