కలిసొచ్చిన అదృష్టం
నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని,యాదృచ్ఛికంగా సినీరంగలోకి అడుగుపెట్టానని చెప్పింది మంగళూరు సోయగం కృతిశెట్టి. ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందీ భామ.
నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని,యాదృచ్ఛికంగా సినీరంగలోకి అడుగుపెట్టానని చెప్పింది మంగళూరు సోయగం కృతిశెట్టి. ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందీ భామ. అయితే ఆ తర్వాత అవకాశాలైతే వచ్చాయి కానీ విజయాలు మాత్రం దక్కలేదు. ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన చేస్తున్న ‘వా వాతియర్’, ప్రదీప్‌రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్’ చిత్రాలపై ఈ అమ్మడు భారీ ఆశల్ని పెట్టుకుంది.
తాజా ఇంటర్వ్యూలో సినీరంగంలో తన ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కృతిశెట్టి. ‘ఓ కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం నేను ముంబయిలోని ఓ స్టూడియోకు వెళ్లాను. అది పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యా. అయితే నాన్న వస్తానన్న సమయానికి కాకుండా కొంచెం ఆలస్యంగా అక్కడకు ఇచ్చారు.
ఈలోగా పక్కనే ఉండే స్టూడియోను చూద్దామని వెళ్లా. అక్కడి వాళ్లు నన్ను చూసి..ఆడిషన్‌కు వచ్చారా? సినిమాల్లో నటిస్తారా? అని అడిగారు. వారికి అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చి బయటికొచ్చాను. ఆ తర్వాత ఆ యూనిట్ వాళ్లు కాల్ చేసి ఆడిషన్‌కు రమ్మన్నారు. ఆ ప్రయాణంలో నాకు సినిమా మీద ఆసక్తిపెరిగింది. ఒకవేళ మా నాన్న ఆరోజు ఆలస్యంగా రాకుంటే యాడ్ ఫిల్మ్స్ మోడల్‌గానే స్థిరపడిపోయేదాన్ని కావొచ్చు’ అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకుంది కృతిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

