Krishnamma Movie | హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు.
థీమ్ ఆఫ్ వెంజెన్స్ అనే పేరుతో సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. చూపుల్లో శూన్యం సుడిలో హృదయం పైపైనే మౌనం ఎదలో మథనం అంటూ సాగిన ఈ పాట చూస్తే ప్రతీకారం తీర్చుకోడానికి పగతో ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను కాలభైరవ కంపోజిషన్‌లో దీలిపు, కాలభైరవ కలిసి పాడరు.
ఇక ఈ సినిమాను మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఈ ముగ్గురికి ఓ విలన్‌కు మధ్య జరిగే గొడవే ‘కృష్ణమ్మ’. వీరి మధ్య జరిగిన ఓ ఘటన వారి ముగ్గురి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.