Ranga Ranga Vaibhavanga | ఉప్పెన ‘జలపాతం’ సాంగ్‌ను గుర్తు చేస్తున్న ‘కొత్తగా లేదేంటి’ వీడియో సాంగ్..!
Kothaga Ledenti Video Song | ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డెబ్యూ హీరోగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ సినిమాతో 100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ‘కొండపొలం’ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ‘కొత్తగా లేదేంటి’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన ‘కొత్తగా లేదేంటి’ ఆడియో సాంగ్‌కు శ్రోతల నుండి విశేషమైన స్పందన వచ్చింది. కాగా తాజాగా మేకర్స్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను శ్రీమణి రచించగా.. ఆర్మాన్ మాలిక్, హరి ప్రియ ఆలపించారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా కేతికశర్మ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

