అజయ్, వీర్తి వఘాని జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ఇది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నేటి యువతరం మనోభావాల్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అన్ని అంశాలుంటాయి’ అని తెలిపారు. ఆనంద్, కాశీవిశ్వనాథ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్‌తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణ సంస్థ: ఫన్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి.